Government "Not Taking Decisions In Time": Nitin Gadkari సొంత ప్రభుత్వంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ నర్మగర్భవ్యాఖ్యలు

Biggest problem is government not taking decisions on time nitin gadkari

Nitin Gadkari, BJP, BJP Parliamentary Board, BJP Central Election Committee, Devendra Fadnavis, BJP, Union Minister Nitin Gadkari, Gadkari comment, Nitin Gadkari timely decision, Government decisions not in time, Maharashtra, Politics

Union Minister Nitin Gadkari has once again garnered attention for another blunt statement against the Centre. The Union Minister, who recently lost his spot in the BJP's top decision-making body, commented, “government is not taking decisions in time."

సొంత ప్రభుత్వంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ నర్మగర్భవ్యాఖ్యలు

Posted: 08/23/2022 05:59 PM IST
Biggest problem is government not taking decisions on time nitin gadkari

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పార్లమెంటరీ బోర్డు నుంచి ఆయనను తొలగించడంపై పార్టీలో చర్చ సాగుతుండగానే ఆయన సొంత ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి పార్లమెంటరీ బోర్డు నుంచి ఆయనను తప్పించిన నాటి నుంచి వరుసగా ఆయన సొంత ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు. గతంలో రాజకీయ పార్టీల తీరుపైనా గడ్కరీ విమర్శలు చేశారు. ఇప్పుడంతా పవర్ ప్లే రాజకీయాలు నడుస్తున్నాయని.. ఈ క్రమంలో రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనిపిస్తోందని ఆయన ఆవేదనను కూడా వ్యక్తం చేశారు.

మరో సందర్భంలో నితిన్ గడ్కరీ మరో సంచలన వ్యాఖ్య చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తన హయాంలో ‘అమృత్ కాల్’ నడుస్తోందని వ్యాఖ్యలు చేసిన మరునాడే నితిన్ గడ్కరీ.. దానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపి ఇప్పుడు అనుభవిస్తున్న ఉన్నత స్థితికి కారణం ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్ పాయ్, దీన్ దయాళ్ ఉపాధ్యయేనని అన్నారు. ఆ మహనీయులు అకుంఠిత దీక్ష, మొక్కవోని పట్టుదలతో.. నిరంతర శ్రమ, కృషి కారణంగానే ఇవాళ బీజేపి కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగిందని అన్నారు. ఇక తాజాగా ఆయనను పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా తొలగించిన తరువాత ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేశారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అవుతోందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles